calender_icon.png 25 January, 2026 | 11:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎర్రగండ్లపల్లిలో విషాద ఛాయలు

25-01-2026 07:39:43 PM

- ఫర్నిచర్ అగ్నిప్రమాదంలో మృతి చెందిన చిన్నారులు ఎరుగండ్లపల్లి వాసులు..

- హృదయ విదారక ఘటనతో  రోదిస్తున్న గ్రామస్తులు

మర్రిగూడ,(విజయక్రాంతి): హైదరాబాద్ నాంపల్లిలో శనివారం అగ్ని ప్రమాద సంఘటనలో మృతిచెందిన చిన్నారులు నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడ మండలం ఎర్రగండ్లపల్లి గ్రామ వాసులు. తల్లిదండ్రులు తోకల లక్ష్మి, యాదయ్య దంపతులకు ప్రణీత్ (11), అఖిల్ (7) కలరు వీరు స్కూలుకు సెలవు ఉన్నందున అదే బిల్డింగ్ లో ఉన్నారు.  తల్లిదండ్రులు పని నిమిత్తం బయటకు వెళ్లారు. అదే సమయంలో మంటలు ఫర్నిచర్ గదిలో అంటుకొని బిల్డింగును పూర్తిస్థాయిలో ఆక్రమించడంతో దిక్కుతోచని ఆ చిన్నారులు అగ్నికి ప్రమాదానికి గురై చిన్నారులు అక్కడే మృతి చెందారు.

గత పది సంవత్సరాల క్రితం తల్లిదండ్రులు జీవనోపాధి కోసం హైదరాబాదు  ఫర్నిచర్ యజమాని వద్ద వాచ్మెన్ గా పని చేసుకుంటూ విధులు నిర్వహిస్తున్నారు. అదే గ్రామంలో ఇద్దరు పిల్లలు ప్రణీతు నాంపల్లి హాలియా పాఠశాలలో ఆరవ తరగతి అఖిలు రెండవ తరగతి చదువుకుంటున్నట్లు తల్లిదండ్రులు స్థానికులు తెలుపుతూ కంటనీరు పెట్టారు.బ్రతుకుదేరువు కోసం కన్న ఊరును విడిచి వలస వెళ్లిన తల్లిదండ్రులకు జీవితాంతం దిక్కుతోచని పరిస్థితి ఏర్పడడంతో ఎరగండ్ల పెళ్లి గ్రామం పూర్తిస్థాయిలో విషాదంలో మునిగిపోయారు.

అనుకోని సంఘటనలో చిన్నారులు అగ్నికి హాహుతి కావడంతో తమకు అర్థం లేదంటూ తల్లిదండ్రులు బోరున విలపించడమే కాకుండా, తల్లిదండ్రుల మూర్చ పోవడం చూసి సమీపబంధువులు గ్రామస్తులు మహిళలు తో సహా విషాదంలో ముంచేత్తడము వర్ణాతీతంగా మారింది.ముక్కు పచ్చలారని చిన్నారుల మృతదేహాలను గ్రామస్తుల, బంధువుల మనసులను కలిసివేసింది. శనివారం జరిగిన సంఘటన అనంతరం పోస్టుమార్టం తర్వాత చిన్నారుల మృతదేహాలను కుటుంబ సభ్యులకు ఆదివారం మధ్యాహ్నం అందజేశారు.దీంతో గ్రామంలో బంధువులు రోదిస్తూన్న సంఘటనను మరింత బాధాకరంగా మారింది.