25-01-2026 07:56:06 PM
సర్పంచుల ఫోరం అధ్యక్షులుగా గుండు రామాంజి గౌడ్
గరిడేపల్లి,(విజయక్రాంతి): మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతోనే గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయని గరిడేపల్లి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు గుండు రామాంజి గౌడ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచుల మండల ఫోరం అధ్యక్షులుగా రాయినిగూడెం గ్రామ సర్పంచ్ గుండు రామాంజిగౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఆదివారం మండల కేంద్రమైన గరిడేపల్లిలో మండలంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచుల సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా గుండు రామాంజిగౌడ్, ఉపాధ్యక్షులుగా కటకం వేణు, ప్రధాన కార్యదర్శిగా బానోతు అరుణ రమేష్, కోశాధికారిగా కుర్రి మహేష్, కార్యదర్శిగా కాచవరపు నరసింహారావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు త్రిపురం అంజన్ రెడ్డి,మాజీ ఎంపీపీలు,జడ్పిటిసిలు పైడిమర్రి రంగనాథ్,పెండెం శ్రీనివాస్ గౌడ్,మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మూలగుండ్ల సీతారామరెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బాల్దూరు సందీప్,కటకం రమేష్,ఆరే కృష్ణారెడ్డి,పరమేష్,మండలంలోని కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించిన సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.