calender_icon.png 25 January, 2026 | 9:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలు సాధిస్తాం

25-01-2026 07:48:58 PM

గౌడ సంఘం మండల అధ్యక్షుడు తునికి సాయిలు గౌడ్

తుంగతుర్తి,(విజయ క్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని సర్వాయి పాపన్న విగ్రహం వద్ద గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘం క్యాలెండర్ ను గౌడ సంఘం మండల అధ్యక్షుడు తునికి సాయిలు గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఏర్పాటుచేసి క్యాలెండర్ ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని, సర్వాయి పాపన్న ఆశయాల కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గుండగాని కవిత రాములు గౌడ్, మాజీ దేవాలయ చైర్మన్ పులుసు వెంకటనారాయణ గౌడ్, మాజీ గ్రంథాలయ చైర్మన్ గోపగాని రమేష్ గౌడ్, బత్తుల జలేంధర్ గౌడ్, గీత కార్మిక సంఘం మండల అధ్యక్షుడు మద్దెల నర్సయ్య, గుండగాని రాము, సూర్యప్రకాష్, బత్తుల శ్రీనివాస్, గోపగాని వెంకన్న, తునికి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.