25-01-2026 07:47:24 PM
జిల్లా కలెక్టర్ కె.హరిత
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఈ నెల 26వ తేదీన జిల్లా కేంద్రంలో జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె. హరిత అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో చేపట్టిన గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను జిల్లా అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, ఎం. డేవిడ్, ఆసిఫాబాద్ రాజస్వ మండల అధికారి లోకేశ్వర్ రావులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... గణతంత్ర వేడుకల నిర్మాణ కొరకు ఆయా శాఖలకు కేటాయించిన విధులను సమర్ధవంతంగా నిర్వహించాలని తెలిపారు.
వేడుకలకు హాజరయ్యే ప్రముఖులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్రాగునీరు, నీడ సౌకర్యాలు కల్పించాలని, పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలని, జిల్లాలో అమలు చేసిన సంక్షేమ పథకాల వివరాలతో సంబంధిత శాఖల అధికారులు స్టాల్ లు ఏర్పాటు చేయాలని, విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలకు మైదానం సిద్ధం చేయాలని తెలిపారు. వేడుకలలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.