calender_icon.png 25 January, 2026 | 9:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డి జిల్లాలో జాతీయ ఓటరు దినోత్సవం

25-01-2026 07:51:08 PM

ర్యాలీ లు, ప్రతిజ్ఞ కార్యక్రమాలు నిర్వహించిన అధికారులు, విద్యార్థులు

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో జాతీయ ఓటర్ దినోత్సవం 2026 సందర్భంగా పలు కార్యక్రమాలను అధికారులు నిర్వహించారు. కామారెడ్డి జిల్లాలో ఘనంగా ఓటర్ దినోత్సవ ర్యాలీలు, ప్రతిజ్ఞ కార్యక్రమాలను చేపట్టారు. కామారెడ్డి  జిల్లా కేంద్రంలో నిజాం సాగర్  చౌరస్తా నుండి బస్ స్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో అదనపు కలెక్టర్ విక్టర్, మాట్లాడుతూ... 18 సంవత్సరాలు నిండిన అర్హులైన ఓటర్లు ఓటర్ గా నమోదు చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కామారెడ్డి  ఆర్డీఓ వీణ,తహసిల్దార్ జనార్ధన్, మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి,డిస్ట్రిక్ట్ స్పోర్ట్సఆఫీసర్ రంగా వెంకటేశ్వర్ గౌడ్, RK కాలేజీ సీఈవో జైపాల్ రెడ్డి, ప్రిన్సిపల్ దత్తాద్రిరావు, వివిధ కాలేజీల ప్రిన్సిపాల్స్, ఎన్సీసీ క్యాడెట్లు, మెప్మా పీడీ శ్రీధర్ రెడ్డి, ఐకెపి మహిళలు, బీ.ఎల్.ఓ.లు, వివిధ కళాశాలలో విద్యార్థులు, వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఓటర్ల దినోత్సవం ప్రతిజ్ఞ చేశారు.