calender_icon.png 25 January, 2026 | 9:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

25-01-2026 08:01:14 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆసిఫాబాద్‌లోని శ్రీ పార్వతి సమేత బాలేశ్వర స్వామి వారి జాతర మహోత్సవంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వామి వారిని దర్శించుకొని, ఆలయ అర్చకుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని స్వామి వారిని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో గుండి సర్పంచ్ జాబరి రవీందర్, బీఆర్‌ఎస్ నాయకురాలు మర్సకోల సరస్వతి, మాజీ సర్పంచ్ బలరాం నాయక్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.