25-01-2026 07:34:31 PM
బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూరు మండల కేంద్రంలో జాతీయ 16వ ఓటర్ దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ పాఠశాల విద్యార్థులచే మండల కేంద్రంలోర్యాలీ నిర్వహించారు. 18 సంవత్సరాల నిండిన యువతీ యువకులు ఓటరు నమోదు చేసుకోవాలని కోరారు. ఓటు వజ్రాయుధమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ సునీత, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీరామ తిరుపతి, జిపిఓ మారుతి, జూనియర్ అసిస్టెంట్లు ప్రకాష్, దేవాజి, సిబ్బంది పాల్గొన్నారు.