calender_icon.png 23 December, 2025 | 11:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్ద కాపర్తిలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు

23-12-2025 09:40:42 PM

చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో ఏఐజి హాస్పిటల్‌కు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ వి. కులకర్ణి, డాక్టర్ దువ్వూరి నాగేశ్వరరావు బృందం  ఉచిత వైద్య  శిబిరం మంగళవారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని పెద్దకాపర్తి గ్రామ సర్పంచ్ కాటం వెంకటేశం ప్రారంభించి మాట్లాడుతూ... గ్రామ ప్రజలు ఇలాంటి ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకుని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు. శిబిరంలో హార్ట్, లివర్, కిడ్నీ సంబంధిత స్కానింగ్లు, వైద్య పరీక్షలను పూర్తిగా ఉచితంగా నిర్వహించారు. గ్రామీణ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఓర్సు సైదులు, ఏర్పుల యాదయ్య, చిలుకల కృష్ణ, నరేష్ తదితర గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.