23-12-2025 09:37:29 PM
తుంగతుర్తి,(విజయక్రాంతి): గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థ వారు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రకృతి వ్యవసాయం చేస్తున్న దంపతులను పుడమిపుత్ర అవార్డు ఇచ్చి ఘనంగా సన్మానించినారు. ఇట్టి అవార్డు తెలంగాణ రాష్ట్ర రైతు వెల్ఫేర్ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి గారి చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. స్థలం నకిరేకల్ లోని శ్రీనివాస కళ్యాణం మంటపం ఎటువంటి రసాయనాలు వాడకుండా ఈ భూతల్లిని కాపాడుతున్న ప్రకృతి వ్యవసాయ దారులను జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా సన్మానించినారు తుంగతుర్తి మండల ప్రజలు, రైతులు హర్షం వ్యక్తం చేశారు