13 March, 2026 | 4:16 AM

ప్రగతి ప్రణాళికలో ఉచిత వైద్య శిబిరం

13-03-2026 12:00 AM

బోయినపల్లి: మార్చి 1౨(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్  ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి పరీక్షలు చేసి మందులు అందించారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన, ప్రగతి ప్రణాళికలో  భాగంగా  గురువారం విలాసాగర్ గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శ్రీ ఏనుగుల కనకయ్య సర్పంచ్ గారి అధ్యక్షతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో క్యాంపును ప్రారంభించడం జరిగింది.

ఈ శిబిరంలో స్త్రీ రోగ, చిన్నపిల్లల, కంటి, దంత,ఎముకల, మరియు జనరల్ వైద్య నిపుణులు పాల్గొని ప్రజలకు వైద్య పరీక్షలు మరియు వైద్య సేవలు అందించారు. ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎనుగుల కనకయ్య గారు, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు,ప్రత్యేక వైద్యులు, ఇతర సిబ్బంది,ఆశ కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు ఇట్టి క్యాంపులో పాల్గొన్నారు.