4 September, 2026 | 10:47 PM

Breaking News

ఉమ్రిలో ఘనంగా మండల స్థాయి కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభం   •   శిరీష కుటుంబానికి అండగా నిలవాలి   •   మద్దూరులో అభివృద్ధి పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి   •   బాన్సువాడలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు   •   హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం : మాజీ ఎమ్మెల్యే గండ్ర   •   శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు - యాదవుల ఐక్యతకు నిదర్శనం   •   ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ ఆకస్మిక తనిఖీ   •   నిజాంసాగర్ మండలం ఉత్తమ ఉపాధ్యాయులుగా బీ సమత, అజయ్ కుమార్   •   కొత్తగూడెం కలెక్టరేట్ వద్ద ఎంపీ వద్దిరాజు, మాజీ మంత్రి వనమా వంటావార్పు   •   భక్తి, ఆధ్యాత్మికతతోనే సమాజంలో ఐక్యత   •  

జిల్లా పరిషత్ హైస్కూల్ లో ఉచిత మెగా వైద్య శిబిరం

29-06-2025 | 08:30pm

చివ్వేంల: చివ్వేంల మండల కేంద్రంలో జిల్లా పరిషత్ హై స్కూల్ లో మెగా వైద్య శిబిరం(Medical Camp) నిర్వహించిన దారవత్ బాలు నాయక్ లంబాడి విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షులు, బానోత్ సురేష్ నాయక్ ఏఐబిఎస్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వారి ఆధ్వర్యంలో కిమ్స్-సన్‌షైన్(KIMS-SUNSHINE) హాస్పిటల్, టీం విమలాకర్ ఫౌండేషన్ హైదరాబాద్ వారి సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. అల్ట్రాసౌండ్ అబ్డోమెన్, యూజీఐ ఎండోస్కోపి, ప్రాక్టోస్కోపి, ఇసీజీ, 2డి-ఎకో, సీబీపీ, లివర్ ఫంక్షన్ టెస్ట్, లిపిడ్ ప్రొఫైల్, బీపీ, షుగర్ 14 రకాల స్క్రీనింగ్ టెస్టులు చేయడం జరిగింది. ప్రస్తుత కాలంలో విపరీతంగా పెరుగుతున్న రోగాలు, వాటికీ అవుతున్న ఖర్చులు సామాన్యులకు చాలా కష్టంగా మారిందని గ్యాస్ట్రాలజీ డాక్టర్ విమలాకర్ రెడ్డి తెలిపారు.

ప్రజలు అత్యధికంగా 500 నుండి 1000 మంది ప్రజలు ఉచిత వైద్యం అందుకున్నారు. తండల నుండి గ్రామాల నుంచి తరలివచ్చిన ప్రజలు చాలా సంతోషాన్ని వ్యక్తం చేసారు. ఇలాంటి సేవ కార్యకమాలు మరల ఎన్నో చేయాలనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో కిషన్ మోర్చా జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ నాయక్ బీజేపీ మండల అధ్యక్షులు మాదారపు అనిల్ రావు, మంగత నాయక్, ఏఐబిఎస్ఎస్  లైఫ్ మెంబర్ బానోత్ లింగ నాయక్ రిచ్ ఇండియా ఫౌండర్ ధరవత్ రేణుక లాకు నాయక్ ex ఎంపీటీసీ సాగర్ నాయక్ లంబాడి విద్యార్థి సేన జిల్లా అధ్యక్షులు హరీష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.