13 April, 2026 | 5:14 AM

టీచర్లకు ఉచిత క్వెస్ట్ ట్రైనింగ్

09-05-2024 01:28 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 8 (విజయక్రాంతి): విద్యార్థులకు లైఫ్ స్కిల్స్, నాణ్యమైన విద్యను అందించడం కోసం లయన్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు ఉచితంగా క్వెస్ట్ ట్రైనిం గ్ ఇవ్వబోతున్నట్లు లయన్ డాక్టర్ హిప్నో పద్మాకమలాకర్ తెలిపారు. బుధవారం మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే క్వెస్ట్ ట్రైనింగ్‌లో ప్రభుత్వ, ప్రైవేట్ టీచర్లకు ఉచిత శిక్షణ ఇస్తామన్నా రు. ఇటీవల క్వెస్ట్ ఓరియంటేషన్ క్యాంప్ ను సికింద్రాబాద్‌లో నిర్వహించినట్లు చెప్పారు. 2024 సంత్సరానికి క్వెస్ట్ చైర్‌పర్సన్‌గా మాధవరావు, కో ఆర్డినేటర్స్‌గా తనను, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన శ్రీహరిని నియమించారని తెలిపారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు సునీల్‌కుమార్, లయన్ రేణుక, డాక్టర్ లక్ష్మిమూర్తి, గోవిందరాజు పాల్గొన్నారు.