13 April, 2026 | 3:41 AM

మరో రెండ్రోజులు వర్షాలే

09-05-2024 01:25 AM

పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ 

వాతావరణ శాఖ

హైదరాబాద్,మే 8 (విజయక్రాంతి): వచ్చే రెండు రోజుల పాటు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. గురువారం అక్కడక్కడ సాయంత్రం సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాత నమోదయ్యే అవకాశం ఉందని, భారీ వర్షం పడే సూచనలు ఏమీ కనిపంచడం లేదని తెలిపింది. మే 12న మాత్రం రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంద ని, ఈ నాలుగు రోజులు వాతావరణం చల్లగా ఉంటుందని అధికారు లు తెలిపారు.

ఆదిలాబాద్, నిర్మల్ మినహా రాష్ట్రం మొత్తం మీద 36 నుంచి 40డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెబుతున్నా రు. మే 15వ తేదీ వరకు రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి ఉంటుందని, మే 20 తర్వాత రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొన్నారు. ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రం భీం, మంచిర్యాల, జగిత్యాల, నిజాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కరీనంగర్, జయశంకర్, సిద్దిపేట, హనుమకొండ, వరంగల్, మేడ్చల్, యాదాద్రి, రంగారెడ్డి, మహబూబాబాద్, భద్రాద్రి, సూర్యాపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను వాతావరణ శాఖ జారీచేసింది.