19 June, 2026 | 1:34 AM

మహిళల ఆర్థిక సాధికారతకు ఉచిత కుట్టు శిక్షణ

19-06-2026 12:00 AM

జయచంద్ర రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ప్రారంభం

నాగోల్, జూన్ 18 (విజయ క్రాంతి): చైతన్యపురి డివిజన్ న్యూ దిల్సుఖ్నగర్ కమ్యూనిటీ హాల్లో జయచంద్ర రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో  మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రతినిధులు మాట్లాడుతూ, మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు సహకారం అందిస్తున్న జయచంద్ర రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ దేవిరెడ్డి కమల సుధీర్ రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

శిక్షణ పూర్తిచేసుకున్న మహిళలు స్వయం ఉపాధి ద్వారా కుటుంబ ఆర్థికాభివృద్ధికి తోడ్పడగలరని చెప్పారు.  ఈ కార్యక్రమంలో చైతన్యపురి డివిజన్ బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, ఎల్బీనగర్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ మహిళా అధ్యక్షురాలు రంగేశ్వరి నాయుడు, త్రివేది, శోభారాణి, నాగలక్ష్మి, శివప్రకాష్, విశ్వప్రేమ్, జయశ్రీ, అర్చన, అనురాధ, కవిత, తస్లీమ్, సౌమ్య, శివబిందు, మంగ తదితరులు పాల్గొన్నారు.