calender_icon.png 7 August, 2025 | 12:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనురాగ్ విశ్వవిద్యాలయంలో ముగిసిన ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్ వర్క్‌షాప్

06-08-2025 12:00:00 AM

ఘట్ కేసర్, ఆగస్టు 5 : అనురాగ్ విశ్వవిద్యాలయంలో ఐఈఈఈ-ఎస్‌ఎస్‌ఐటీ ఆధ్వర్యంలో నిర్వహించిన  ఫ్రంట్ ఎండ్ డెవలప్ మెంట్ వర్క్ షాప్ ముగిసింది. ఐఈఈఈ-ఎస్‌ఎస్‌ఐటీ విద్యార్థుల విభాగం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం అనురాగ్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో బీ-టెక్ విద్యార్థుల కోసం రెండు రోజుల ‘ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్‘ ఐటి విభాగాధిపతి డాక్టర్ నితీషా శర్మ జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించిన ఈ వర్క్‌షాప్ విజయవంతంగా ముగిసింది.

వర్క్‌షాప్‌లో విద్యార్థులు హెచ్ టిఎంఎల్, సిఎస్‌ఎస్, జావా స్క్రిప్ట్ వంటి ఆధునిక వెబ్ టెక్నాలజీలపై ప్రాథమిక అవగాహనతో పాటు రియల్ టైమ్ ప్రాజెక్ట్ హ్యాండ్స్-ఆన్ అనుభవాన్ని పొందగలుగుతారు. బూట్స్ట్రాప్ వాడకంతో మొబైల్ రెస్పాన్సివ్ డిజైన్ ను ఎలా రూపొందించాలో వెబ్ పేజీలను ఎలా రూపొందించాలో ఈ సెషన్లో నేర్చుకుంటారు.

పరిశ్రమ నిపుణుల మార్గదర్శకత్వంలో జరిగే ఈ వర్క్‌షాప్ విద్యార్థులకు అనుభవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, మరియు కెరీర్ అభి వృద్ధికి తోడ్పడే ప్రాథమిక నైపుణ్యాలను అందిస్తుంది. వర్క్‌షాప్ అనుమతి ఇచ్చిన మేనేజ్మెంట్కి ఐఈఈఈ ఎస్‌ఎస్‌ఐటి ఫ్యాకల్టీ ఇంచార్జి డాక్టర్ జి.ఎల్. ఆనంద్ బాబు విద్యార్థి సమన్వయకర్తలు కృతజ్ఞతలు తెలిపారు.