06-08-2025 12:00:00 AM
కలెక్టర్ జితేష్ వీ. పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం ఆగస్టు 5 (విజయ క్రాంతి): జిల్లా ఆస్పిరేషన్ జిల్లాగా కాకుండా దేశానికే ఆదర్శంగా నిలిచే ఇన్స్పిరేషన్ జిల్లా గా రూపాంతరం చెందాలనే లక్ష్యంతో ప్రతి శాఖ సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ సూచించారు. మంగళవారం ఐడిఓసి కార్యాలయంలో నిర్వహిం చిన సంపూర్ణత అభియాన్ సమ్మాన్ సమారోహ్ జిల్లా స్థాయి అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పా ల్గొన్నారు.
జిల్లా ప్లానింగ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. సిపిఓ సంజీవరావు మాట్లాడుతూ ఆకాంక్షిత జిల్లాల అభివృద్ధి లో భాగంగా జిల్లాలో వివిధ శాఖలు చేపడుతు న్న అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్గా గుర్తింపు పొందిన భద్రాద్రి కొత్తగూ డెం జిల్లా రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలవడం గర్వకారణమని అన్నారు. కేంద్ర ప్రభు త్వం, నీతి అయోగ్ సంయుక్తంగా వెనుకబడిన జిల్లాల అభివృద్ధి చేయడమే లక్ష్యంగా చేపట్టిన ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ద్వా రా జిల్లాలో అనేక రంగాల్లో విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయన్నా రు.
ప్రతి ఉద్యోగి సమర్థంగా పనిచేయడంతోనే జిల్లా ఈ స్థాయికి చేరుకుందన్నారు. దీ ని ద్వారా జిల్లా దేశవ్యాప్తంగా ఆదర్శ జి ల్లాగా నిలవనుందని ఆశాభావం వ్యక్తం చేశా రు.జిల్లా వ్యాప్తంగా పిల్లలలో పోషకాహార లోపం, ఎనీమియా వంటి సమస్యలను ఎ దుర్కొనేందుకు వివిధ చర్యలు తీసుకుంటు న్నామని తెలిపారు. వైద్య, మహిళా శిశు సం క్షేమ శాఖల సమన్వయంతో జిల్లాలో అవసరమైన శిక్షణా తరగతులు నిర్వహించి ఆహార పు అలవాట్లను మెరుగుపరిచేలా చర్యలు తీ సుకోవాలన్నారు.
విద్యా రంగాన్ని మరింత బ లోపేతం చేయడానికి స్మార్ట్ అంగన్వాడీలు, డిజిటల్ తరగతులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వంటివి ఉపయోగపడుతు న్నాయని, సిడిపిఓ, సూపర్వైజర్లు అంగన్వాడీ టీచర్లు సమన్వయంతో అంగన్వాడీ కేంద్రాలను అభివృద్ధి పరచడానికి ప్రణాళికలు రూ పొందించాలన్నారు. రేగళ్ల అంగన్వాడీ కేం ద్రంలో గతంలో చీకటి, ఉక్క పోత వల్ల పిల్ల లు రావడం తగ్గిపోయిందని, ఇప్పుడు విద్యు త్,
ఫ్యాన్ వంటివి ఏర్పాటు చేయడం వల్ల పిల్లల హాజరు పెరిగిందని వివరించారు. జి ల్లా వ్యాప్తంగా ప్రతి అంగన్వాడీ కేంద్రం, ప్రతి పాఠశాలలో విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించేందుకు ఉన్నటువంటి సమస్యలు , వాటి పరిష్కారాలను నివేదికల సమర్పించడం ద్వారా ఒక్కొ క్కటిగా పరిష్కరిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో విద్య, వైద్య, మహిళా శిశు సంక్షే మ, తదితరులు పాల్గొన్నారు.