06-08-2025 12:00:00 AM
జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 5, (విజయ క్రాంతి)జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని విజయవంతం చేయాలని జి ల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడిఓసి కార్యాలయ ం సమావేశ మందిరంలో ఈ నెల 11వ తేదీన నిర్వహించనున్న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం రోజున 1 నుండి 19 సంవత్సరాల వయసు గల వారందరికీ నులిపురుగులను నివారించే ఆల్బెండ జోల్ మాత్రలను అందించాలన్నారు.
ము ఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ, గిరిజన ఆ శ్రమ పాఠశాలలు, వసతి గృహాలలో ప్రతి విద్యార్థులకు మాత్రలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ మాత్రల ద్వారా పిల్లల్లో రక్తహీనత, బుద్ధిమధ్యం, చదువుల పట్ల ఏకాగ్రత పెంపొందుతుందన్నారు. విద్యాశాఖ, ఏఎన్‌ఎం, అంగన్వాడీలు సమన్వయంగా పనిచేసే ఈ ఒక్కరిని విడిచి పెట్టకుండా మాత్రలను అందివ్వాలి అన్నా రు.
ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు, అంగన్వాడి పిల్లలకు మాత్రలు అం దించాలన్నారు. అంగన్వాడి టీచర్లకు శిక్షణ ఇచ్చి వయసుల వారీగా మాత్రల డోస్ ఇ వ్వాలన్నారు. భోజనం తర్వాతనే ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలన్నారు. పాత్రలు వేసే ప్రదేశంలో తగినంత త్రాగునీరు అందుబాటులో ఉంచుకోవాలన్నారు.
ఈ సమావే శంలో జిల్లా వైద్య శాఖ అధికారి జయలక్ష్మి, సిపిఓ సంజీవరావు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి స్వర్ణలత లెనినా, డాక్టర్ తేజ శ్రీ, డాక్టర్ స్పందన, డాక్టర్ మధురం, డాక్టర్ భూపాల్ రెడ్డి, ఎండి ఫయాజుద్దీన్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.