calender_icon.png 25 August, 2025 | 11:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెట్రోల్ ట్యాంకర్‌లో మంటలు

11-12-2024 05:03:17 PM

నాంపల్లి: హైదరాబాద్‌లోని నాంపల్లి వద్ద ఏక్ మినార్ మసీదు సమీపంలో ఉన్న హెచ్‌పీ పెట్రోల్‌ పంప్‌ బంక్‌లో బుధవారం ఇంధన ట్యాంకర్‌లో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది త్వరగా మంటలను ఆర్పివేయడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. దీంతో పెను ప్రమాదం తప్పింది. రెండు అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్‌ స్తంభించింది. స్థానికుల సమాచారంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.