calender_icon.png 25 August, 2025 | 4:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కస్తూర్బా విద్యార్థులకు అస్వస్థత

11-12-2024 04:57:33 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): జిగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలంలోని కస్తూర్బా గురుకుల పాఠశాలలో ఏడుగురు విద్యార్థులు బుధవారం అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన బాలికలను హుటాహుటినా అంబులెన్స్ లో జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులను పరిశీలించిన వైద్యులు చలి తీవ్రత వల్లే విద్యార్థులకు కాళ్లు, చేతులు తిమ్మిర్లు వచ్చి అస్వస్థతకు గురైనట్లు తెలిపారు.

దవాఖానలో చికిత్స పొందుతున్న విద్యార్థినిలను డీఎంహెచ్వో ప్రమోద్ కుమార్ పరామర్శించి, వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అనంతరం ప్రమోద్ మీడియాతో మాట్లాడుతూ... విద్యార్థుల పరిస్థితి బాగానే ఉందని, చలితో పాటు యాంగ్జైటీ కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు పేర్కొన్నారు. సాచ్యురేషన్ తోపాటు లంగ్స్ లో ఎలాంటి సమస్య లేదని, డాక్టర్లు ఎప్పటికప్పుడు విద్యార్థులను పరీక్షిస్తున్నారని ప్రమోద్ కుమార్ వెల్లడించారు.