08-09-2025 12:00:00 AM
సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండ శ్రీశైలం
చండూరు, (గట్టుప్పల) సెప్టెంబర్ 7 ( విజయక్రాంతి): గ్రామాల్లో మౌలిక సదుపాయాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. ఆదివారం గట్టుప్పల మండల పరిధిలోని తేరటు పల్లి గ్రామం లో సిపిఎం గ్రామ శాఖ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రం ప్రభుత్వం 11 సంవత్సరాలుగా ప్రజా సమస్యలను పరిష్కరించకుండా భావద్వేగా లను రెచ్చగొడుతూ విధ్వంస పాలన కొనసాగిస్తుందని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 మాసాలు గడిచిన ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తుందని ఆయన అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు లేకపోవడంతో గ్రామాలలో ప్రజా సమస్యలు పరిష్కారం కావడం లేదని వెంటనే ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి గ్రామాల్లో స్థానిక సమస్యల పరిష్కారం అయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని ఆయన అన్నారు.
వెంటనే మారు మూలగ్రామాలకు పల్లె వెలుగు బస్సులు పునరుద్ధరించాలన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అధ్యయనం చేసి వాటిపై పోరాటాలు నిర్వహించాలని, ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు ప్రజా పోరాటాలు నిర్వహించా లని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
సెప్టెంబర్ 12 కామ్రేడ్ సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి సభలను మండల కేంద్రాల్లో, గ్రామాల్లో ఘనంగా నిర్వహించాలని, మేధావులు, పార్టీ కార్యకర్తలు, సాను భూతిపరులు, ప్రజలు అధిక సం ఖ్యలో పాల్గొని ఏ చూరి వర్ధంతిని జయప్రదం చేయాలని ఆయన అన్నారు. సిపిఎం నాయకులు పగిళ్ల శ్రీనివాస్, అచ్చిన శ్రీనివాస్, వల్లూ రు శ్రీశైలం, మల్గే శివ, బండారి కృష్ణయ్య, పబ్బు మారయ్య, కట్ట కృష్ణయ్య, సత్తయ్య, విజిలి రాము లు, అచ్చిన బీరయ్య పాల్గొన్నారు.