08-09-2025 12:00:00 AM
పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
మణుగూరు, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి) : పినపాక నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయటమే తన లక్ష్యమని, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అ న్నారు.ఆదివారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పా త్రికేయుల సమావేశంలో ఎమ్మెల్యే మా ట్లా డుతూ.. నియోజకవర్గంలో అభివృద్ధి కో సం సీఎం రేవంత్ రెడ్డి చోరవతో ప్రభుత్వం రూ.125 కోట్ల నిధుల ను అభివృద్ధి పనుల కోసం కేటాయిందని తెలిపారు.
ఈ నిధులతో నియోజవర్గంలోని అన్ని మండలాల లో గ్రామాలకు రోడ్లు, మౌలిక వసతులు కల్పిస్తామని పేర్కొన్నా రు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయత్వం లోని కాంగ్రెస్ ప్రభుత్వం నియోజక వర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తుందన్నారు.నియోజక వర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించడంతో పాటు..
ని యోజక వర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానన్నారు. ఈసమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినాకి నవీన్, కాంగ్రెస్ నాయకులు శివ సైదులు, కూచిపూ డి బాబు, సుబ్బారెడ్డి పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల రోడ్లు అభి వృద్ధి చేస్తే అందరికి మేలు జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు.