08-09-2025 12:00:00 AM
జిల్లాకు ఇప్పటివరకు రూ. 2.28 కోట్ల నిధులు విడుదల
273 మందికి లబ్ధి ప్రచారం లేక నీరుగారుతున్న లక్ష్యం
పథకం పక్కదారి పడుతున్నట్లు ఆరోపణలు?
సకాలంలో ఖర్చు చేయక వెనుదిరిగిన నిధులు
సహచట్టానికి తప్పుడు సమాచారాలు
భద్రాద్రి కొత్తగూడెం సెప్టెంబర్ 7 (విజయక్రాంతి):తల్లిదండ్రుల అనురాగా లకు దూరమ, వివిధ కారణాలతో అనాధలుగా మారిన చిన్నారులకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ వాత్సల్య పథకం అం డగా నిలుస్తోంది. మహిళా శిశు వికలాంగుల వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో పిల్లల్ని బదిలీ వేయవద్దు అనే నినాదంతో ఈ పథకాన్ని 2023- 24 ఆర్థిక సంవత్సరంలో అ మల్లోకి తెచ్చారు.
భారతదేశంలోని ప్రతి బి డ్డకు ఆరోగ్యకరమైన, సంతోషకరమైన బా ల్యాన్ని అందించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. గత రెండు సంవత్సరాలుగా పథకం అమలు అవుతున్న అధికారుల మధ్య సమన్వయ లోపం, ఆశించిన రీతిలో తగిన ప్రచారం లేక లక్ష్యం నేరు గారు తోం ది. దీంతో నిధులు పక్కదారి పడుతున్నాయ ని ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. పథకం అనాధలకు అండగాదు అధికారుల కు కల్పతరువుగా మారిందనే విమర్శలు వెలబడుతున్నాయి.
వచ్చిన ఆరోపణలకు తగిన విధంగానే 2023 24 ఆర్థిక సంవత్సరంలో మంజూరైన నిధులు సకాలంలో ఖర్చు చే యని కారణంగా రూ31, 63, 322 నిధులు వెనక్కు మళ్ళీ పోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్షం. అంతేకాదు ప్రస్తుత 2024 - 25 ఆర్థిక సంవత్సరంలో మంజూరైన నిధుల నుంచి పనులు ప్రారంభించక ముందే చిల్డ్రన్స్ హోమ్ నిర్మాణం కోసం రూ 60,09,360 నిధులను టీజీ డబ్ల్యూ ఐ డి సి కి బదలాయించడం నిబంధనలకు వి రుద్ధం.
ఈ పథకం తీరుతెన్నులు, వచ్చిన నిధుల వ్యయంపై సమాచార హక్కు చట్టానికి నిధులు ఖర్చయినట్లు అధికారులు లె క్కలు చెప్పడం విడ్డూరంగాగా ఉంది.భద్రా ద్రి కొత్తగూడెం జిల్లాలో 2023- 24 ఆర్థిక సంవత్సరంలో 1,11,44,200, 2024- 25 ఆర్థిక సంవత్సరంలో 1,13,80,764 మొత్తం 2,28,24,864 నిధులు మంజూరైనట్లు అధికారిక లెక్కలు చూపుతున్నారు.
ఈ పథకంలో 18 సంవత్సరాల లోపు ఉన్న అనాధలు తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు, క్లిష్ట పరిస్థి తుల్లో ఉన్న పిల్లలకు ఆర్థిక సహాయం, విద్య, వైద్యం, సంరక్షణ, ఇతర అవసరాలను తీర్చ డం, పిల్లల ఆరోగ్య సంరక్షణకు సంపూర్ణ మద్దతు అందించడం, పిల్లలందరూ సమాజంలో సురక్షితమైన జీవితాన్ని గడిపేలా చూడటం పథకం ముఖ్య ఉద్దేశం.
అర్హులు: తల్లిదండ్రులు కోల్పోయిన పిల్ల లు, తల్లిదండ్రులు వివిధ కారణాలవల్ల బ్రతికి ఉన్న, విడిపోయిన పిల్లలు 18 సంవత్సరాల లోపు ఉన్న వారంతా ఈ పథకానికి అర్హులు. అనాధలు అభాగ్యులు తల్లిదండ్రులను కోల్పోయిన వారు తల్లిదండ్రులు దూ రమైన వారు విడాకులు తీసుకున్న తల్లిదండ్రులున్నా వారు,
ప్రకృతి వైపరీత్యాల గురైన వారు, అక్రమ రవాణా దాడుల గురైన వారు, బాల యాచకులు, బాల్య వివాహ బా ధ్యులు, హెచ్‌ఐవి బాధితులు, పీడిత బాల లు, దివ్యాంగులు ప్రభుత్వ కార్యాలయాల్లో జి ఎస్ డబ్ల్యూ ఎస్ హెల్పర్ వంటి ప్రభుత్వ వ్బుసైట్లను సంప్రదించి దరఖాస్తులు చేసుకోవాలి.
జిల్లాలో 273 మంది గుర్తింపు:
పథకం ప్రారంభమైన నాటి నుంచి భద్రా ద్రి కొత్తగూడెం జిల్లాలో ఇప్పటివరకు 253 మందిని గుర్తించి ఈ పథకం ద్వారా చేయూ త నిస్తున్నారు. వారందరికీ నెలకురు నాలుగువేలు ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఐసిడి ఎస్ ప్రాజెక్టుల భారీగా అశ్వరావుపేటలో 1, బూర్గంపాడు లో 6 , చండ్రుగొండలో 95, చర్లలో 4, దమ్మపేటలో 38, దుమ్ముగూ డెం లో 9, కొత్తగూడెంలో 54 , మణుగూరు లో 4, పాల్వంచలో 18, టేకులపల్లిలో 26, ఇల్లందులో 18 మందిని గుర్తించినట్లు అధికారులు తెలియజేశారు.
విడుదలైన నిధులు ఖర్చు చేసేదిలా
జిల్లాకు 2023 - 24లో విడుదలైన నిధు ల నుంచి డి సి పి యు, ఎస్ ఎస్ ఏ, సి డ బ్ల్యూ సి జీతభత్యాలకు గాను రూ 47, 04,778, గుర్తించిన 273 మంది పిల్లలకు జనవరి 2024 నుంచి మార్చి వరకు రూ 4 వేల చొప్పున రూ.32 76 లక్షలు చెల్లించారు. చిల్డ్రన్స్ హోమ్ నిర్మాణం కోసం రూ.31.63 లక్షలు ఖర్చు చేసినట్టు సమాచారం ఇచ్చినప్పటికీ, చిల్డ్రన్ హోం నిర్మాణం చేయకుండా జాప్యం చేయడంతో ఆ నిధులు వెనక్కు మళ్లాయి.
2024 - 25 ఆర్థిక సంవత్సరంలో విడుదలైన నిధుల నుంచి డిసిపియు, ఎస్ ఎస్ ఏ, సి డబ్ల్యూ సి జీతభత్యాలకు గాను రూ 45,32,092, ఎంపిక చేసిన పిల్లలకు రూ.4వేలు చొప్పున జూన్ 2024 వరకు రూ 24. 84 లక్షలు చెల్లించారు. చిల్డ్రన్స్ హో మ్ నిర్మాణానికి రూ 60,09,360 నిధులు ఖర్చు చేసినట్లు అధికారులు సమాచారం ఇచ్చారు.
వాస్తవంగా చిల్డ్రన్స్ హోమ్ నిర్మాణానికి ఇప్పటి వరకు స్థల సేకరణ జరగలే దు. ఆయన అధికారులు వచ్చిన నిధులను టీ జి డబ్ల్యు ఐ డి సి ఇంజనీరింగ్ విభాగానికి బదలాయించటం గమనార్హం .అధికారుల సమన్వయ లోపం కేంద్ర ప్రభుత్వ లక్ష్యం నేరు గారు జిల్లాలో మిషన్ వాత్సల్య పథకం తీరుతన్నులు తేట తెల్లం చేస్తున్నాయి.