calender_icon.png 9 October, 2025 | 11:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధర్మారం రైల్వే ఓవర్ బ్రిడ్జ్‌కు నిధులు కేటాయించాలి

09-10-2025 12:12:33 AM

బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి డిమాండ్ 

నిజామాబాద్, అక్టోబర్ 8 (విజయ క్రాంతి): ఇందూరు జిల్లాకు ముఖద్వారం అయిన ఈ రైల్వే బ్రిడ్జ్ పనులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందనీ. కేంద్రం ఇప్పటికే 93 కోట్ల రూపాయలు విడుదల చేసి రైల్వే బ్రిడ్జి అభివృద్ధి నీ ప్రారంభించిందని, బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం కేవలం 10 కోట్లు ఇవ్వక, పనులు నిలిపివేయడం రేవంత్ రెడ్డి ప్రభుత్వ అశ్రద్ధను స్పష్టంగా చూపిస్తోందనీ ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ రాజీనామా చేయాలనీ డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిధులు కేటాయించినప్పటికీని రాష్ట్ర ప్రభుత్వం నిధులు కొండ అభివృద్ధి పనులు అడ్డుకుంటుందని ఆయన ఆరోపించారు, నిజామాబాదు నగరంలోని మాధవనగర్ రైల్వే బ్రిడ్జ్ వద్ద ఈ రోజు బీజేపీ ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో కార్యక్రమం వహించారు.

ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి మాట్లాడరు. నిధులు ఇచ్చినప్పటికీని రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా పనులకు అడ్డుపడుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ను చేసిన పెద్ద మోసం, అని ఆయన  వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమం లో జిల్లా ప్రధాన కార్యదర్శిలు పోతనకర్ లక్ష్మి నారాయణ, నాగోల్ల లక్ష్మి నారాయణ, న్యాలం రాజు, రూరల్ అసెంబ్లీ కన్వీనర్ పద్మారెడ్డి, 04 డివిజన్ కార్పొరేటర్ ప్రమోద్ కుమార్,రాష్ట్ర కౌన్సెల్ సభ్యులు ఓం సింగ్,ఉపాధ్యక్షులు నక్క రాజేశ్వర్, జిల్లా యువ మోర్చా అధ్యక్షులు సతీష్ రెడ్డి, కార్యదర్శి జ్యోతి,జగన్ రెడ్డి, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు