23-01-2026 08:39:07 PM
లోయపల్లి సర్పంచ్ వల్లపు గంగయ్య యాదవ్
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తానన్న రూ.277 కోట్లను వెంటనే విడుదల చేసి, గ్రామపంచాయతీ అకౌంట్లో జమ చేయాలని లోయపల్లి సర్పంచ్ వల్లపు గంగయ్య యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రం అర్వపల్లిలో మండలంలోని బీఆర్ఎస్ సర్పంచులు, ఉపసర్పంచ్ లతో కలిసి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవికాలం సమీపిస్తున్నందున నీరు లేక గ్రామాలలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మిషన్ భగీరథ నీటిని మండలంలోని ప్రతి గ్రామానికి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.గ్రామాల్లోని స్కూల్లలో చైర్మన్ పదవీకాలం పూర్తి అయినందున సర్పంచ్ లను చైర్మన్లుగా ప్రకటించాలని కోరారు.