23-01-2026 08:36:35 PM
హనుమకొండ,(విజయక్రాంతి): దామెర మండలకేంద్రం లోని పోలీస్ స్టేషన్ సమీపంలో శుక్రవారం రోజున దామెరకు చెందిన భాషబోయిన రాజాలు (58) అనే వ్యక్తి పోలీస్ స్టేషన్ సమీపంలోని వాటర్ ట్యాంకు వద్ద కూర్చుని పక్కనే ఉన్న వారితో మాట్లాడుకుంటూ ఉండగా అకస్మాత్తుగా కింద పడిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే అక్కడే విధుల్లో ఉన్న ఎస్సై కొంక అశోక్ కి సమాచారం అందించగా, ఎస్సై చేరుకొని వెంటనే సిపీఆర్ చేశాడు. ప్రాణాన్ని నిలిపేందుకు తన శాయశక్తుల ప్రయత్నం చేసిన ఫలితం లేకుండా పోయింది. వెంటనే 108 సిబ్బంది చేరుకొని అతన్ని పరీక్షించి చూడగా అప్పటికే మృతి చెందినట్లుగా ధ్రువీకరించారు. దీంతో ఎస్సై అశోక్ మృతదేహాన్ని తన స్వహస్తాలతో ట్రాక్టర్ లో వేసి అతని ఇంటికి చేర్చారు. ఈ సందర్భంగా స్థానికులు ఎస్సై అశోక్ నీ అభినందించారు.