13 July, 2026 | 3:33 AM

సెన్సిటివ్, ఎమోషనల్ అమ్మాయి..

12-12-2024 12:00 AM

అల్లరి నరేష్, అమృత అయ్యర్ జంటగా నటించిన చిత్రం ‘బచ్చల మల్లి’. సుబ్బు మంగాదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మించారు. బచ్చల మల్లి డిసెంబర్ 20న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ అమృత అయ్యర్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.

బచ్చలమల్లి ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు ?

*"హనుమాన్’ షూట్ చేస్తున్నపుడు ఈ కథ విన్నాను. స్క్రిప్ట్, క్యారెక్టర్ చాలా నచ్చింది. ఇందులో క్యారెక్టర్‌కి కథలో చాలా ఇంపార్టెన్స్ ఉంది.

ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది ?

1980 బ్యాక్ డ్రాప్ లో జరిగే కథ ఇది. సిటీ కల్చర్ ఉన్న క్యారెక్టర్‌లో కనిపిస్తాను. చాలా సెన్సిటివ్, వెరీ ఎమోషనల్ క్యారెక్టర్. ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చే అమ్మాయి. ఇందులో నాకు, నరేష్‌కు మధ్య మంచి ఎమోషనల్ సీన్స్ వున్నాయి.  

కథలో మెయిన్ పాయింట్ ఏమిటి?

* ఒక ఆవేశం ఉన్న వ్యక్తి ఆ తరువాత తన ఆవేశం కారణంగా కలిగే నష్టాలను తెలుసుకుని తనని తాను ఎలా మార్చుకున్నాడు? అనేది ప్రధాన కథాంశం.

నరేష్‌తో వర్క్ ఎలా అనిపించింది?

* నరేష్ అద్భుతమైన నటుడు. ఎలాంటి ఎ మోషనైనా పండించగలరు. ఆన్‌స్క్రీన్ అగ్రెసివ్ క్యారెక్టర్ ఉంటుంది. కానీ అఫ్ స్క్రీన్ ఆయన సాఫ్ట్ పర్సన్. చాలా ఫ్రెండ్లీ. 

డైరెక్టర్ సుబ్బు గురించి ?

* సుబ్బు చాలా క్లియర్ విజన్ ఉన్న డైరెక్టర్. చాలా ఫోకస్డ్‌గా ఉంటారు. ఎమోషన్స్ ని చాలా అద్భుతంగా తీశారు.

  మ్యూజిక్ గురించి?

*సీతారామం ఫేం విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ ఇస్తున్నారగానే చాలా ఆనందంగా అనిపించింది. ఇందులో పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. సినిమా రిలీజ్ తర్వాత మరింతగా కనెక్ట్ అవుతాయి.

నిర్మాతల గురించి ?

* రాజేష్ దండా గారితో ఇదివరకే  ఓ సినిమా చేయాలి. కానీ అది కుదరలేదు. ఫైనల్ గా ఈ సినిమాలో పని చేయడం చాలా ఆనందంగా అనిపించింది. సినిమా అంటే చాలా పాషన్ వున్న ప్రొడ్యూసర్.