18 June, 2026 | 4:36 PM

Breaking News

గుడిసెల్లో నివసించే నిరుపేదలకే తొలి ప్రాధాన్యత – ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు   •   తండ్రి జ్ఞాపకార్థం విద్యార్థులకు 120 స్టీల్ వాటర్ బాటిల్ ల పంపిణీ...   •   నకిలీ విత్తనాలు అమ్మితే కేసులు నమోదు   •   ప్రైవేట్ పాఠశాలల అక్రమ వసూళ్ల పై చర్యలు తీసుకోవాలి   •   బాసర ఐఐటీ సీటు సాధించిన విద్యార్థినికి సన్మానం   •   బిజినేపల్లిలో సారా తయారీదారులపై బైండోవర్ కేసులు   •   సీసీ కెమెరాలు ప్రారంభించిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతే   •   ప్రభుత్వ పాఠశాలలో చదివితే బంగారు భవిష్యత్తు   •   ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడిగా అందె అశోక్   •   రైతులకు సర్కార్ శుభవార్త..! 30న 'రైతు భరోసా' నిధులు విడుదల   •  

బోరు బావుల వద్ద చినుకులు గుంతల నిర్మాణం తప్పనిసరి: ఎంపీడీవో

18-06-2026 02:45 PM

బోథ్. జూన్ 18( విజయక్రాంతి):  బోరు బావుల వద్ద ఇంకుడు గుంతల నిర్మాణం తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని ఎంపీడీవో రమేష్ కోరారు. గురువారం ఆయన విజయ క్రాంతి తో మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటు చేసే బోరుబావుల వద్ద ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలని అందుకు ప్రభుత్వ పరంగా నిధులు మంజూరు అవుతాయన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం నివాస గృహాల వద్ద బోరు బావులను తవ్వించినట్లయితే ఇంకుడు గుంట ఉండాలని లేకుంటే భవనాల నిర్మాణానికి అనుమతులు ఇవ్వవద్దని ఆదేశాలు వచ్చాయన్నారు.

నూతనంగా ఇల్లు నిర్మించుకున్న వారు ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకున్నట్లయితే వర్షపు నీరు గుంతలో ఇంకిపోయి వేసవికాలం బోర్లు ఎండిపోకుండా ఉంటాయన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. గురువారం నూతనంగా బోరు బావిని తవ్విస్తున్న యజమానికి ఇంకుడు గుంత విషయమై స్థానిక సెక్రటరీ అంజన్న ద్వారా అవగాహన కలిగించడం జరిగిందన్నారు.