calender_icon.png 23 September, 2025 | 5:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్రిమూర్తి అలంకారంలో దర్శనమిచ్చిన గజ్వేల్ మహంకాళి

23-09-2025 03:17:03 PM

400 కిలోల కుంకుమతో ప్రత్యేక అలంకరణ..

వెయ్యి మంది మహిళలతో సామూహిక కుంకుమార్చన..

గజ్వేల్: గజ్వేల్ పట్టణంలోని మహంకాళి అమ్మవారు 400 కిలోల కుంకుమతో త్రిమూర్తి అలంకారంలో దర్శనమిచ్చింది. రెండవ రోజు గజ్వేల్ మహంకాళి త్రిమూర్తి అలంకారంలో భక్తుల పూజలు అందుకున్నది. శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా యధావిధిగా చండీ హవనము, చతుషష్ట్యూపచార పూజ, గోపూజ, వెయ్యి మందితో సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. ప్రధాన అర్చకులు చాడ నంద బాల శర్మ, చంద్రశేఖర్ శర్మలు వైదిక నిర్వహణ చేయగా, అర్చకులు అంకిత్ మిశ్రా, అనూప్ మిశ్రాలు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలకు హాజరైన భక్తులకు నిత్యాన్నదానం నిర్వహించారు.