calender_icon.png 23 September, 2025 | 4:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

23-09-2025 03:13:58 PM

ఒకరి పరిస్థితి విషమం..

సదాశివనగర్ (విజయక్రాంతి): మండల కేంద్రంలోని జాతీయ రహదారి 44 పై మంగళవారం జరిగిన ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వారిని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో వజ్జపల్లి గ్రామానికి చెందిన ఇద్దరికి గాయాలయ్యాయి. కామారెడ్డి నుండి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వస్తున్నా లింగాల సాయికుమార్, దూసుగాం శ్రీకాంత్ లను అతివేగంగా వెనుకనుండి గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఇరువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను హైవే అంబులెన్సులో కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. దూసుగాం శ్రీకాంత్కు తలకు బలమైన గాయాలు అయ్యి పరిస్థితి విషమంగా ఉంది.