calender_icon.png 23 September, 2025 | 5:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హృద్రోగాలను గుర్తించి శస్త్ర చికిత్స చేయించడం ద్వారా పిల్లలకు కొత్త జీవితం..

23-09-2025 03:52:25 PM

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి..

వనపర్తి (విజయక్రాంతి): పుట్టుకతో వచ్చే హృద్రోగాలను ముందుగానే గుర్తించి, సమయానికి శస్త్రచికిత్స చేయించడం ద్వారా పిల్లలకు కొత్త జీవితం ఇవ్వవచ్చని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి(District Collector Adarsh ​​Surabhi) అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సమావేశ మందిరంలో సత్య సాయి హాస్పిటల్స్(సిద్దిపేట జిల్లా) సహకారంతో ఆర్ బి ఎస్ కే వైద్యాధికారుల ద్వారా గుర్తించిన కాంజెనిటల్ హార్ట్ డిసీజెస్ (పుట్టుకతో వచ్చే హృద్రోగ సమస్యలు)పై ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఆర్.బి.ఎస్. కె సిబ్బంది హృద్రోగ సమస్యలు ఉన్న పిల్లలను గుర్తించి వైద్యం చేయించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

తల్లిదండ్రులు ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను తప్పకుండా వినియోగించుకోవాలని సూచించారు. ఈ వైద్య శిబిరంలో 36 మంది పిల్లలకు హృద్రోగ పరీక్షలు నిర్వహించగా, వారిలో 15 మందికి హృదయ శస్త్రచికిత్స అవసరమని వైద్యులు గుర్తించారు. వీరికి త్వరలోనే సిద్ధిపేట జిల్లా సత్యసాయి హాస్పిటల్లో ఉచిత శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా శ్రీనివాసులు, జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ సాయినాథ్ రెడ్డి, డాక్టర్ పరిమళ, రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం వైద్యాధికారులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.