23-09-2025 04:00:24 PM
బిజెపి రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్..
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): ఆయుర్వేదానికి మూల పురుషుడు ధన్వంతరి అని వార్డు మాజీ కౌన్సిలర్ బిజెపి రాష్ట్ర నాయకుడు పిల్లి రామరాజు యాదవ్ పేర్కొన్నారు. జయంతి సందర్భంగా ఆయుష్ డిపార్ట్మెంట్, నల్లగొండ హెడ్ క్వార్టర్ ఆయుర్వేద డిస్పెన్సరీ ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని ఎనిమిది తొమ్మిది వార్డుల ప్రజలకు ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ధన్వంతరి మానవజాతికి ఆయుర్వేద జ్ఞానాన్ని అందించారని అందుకే వైద్యులు, ఆయుర్వేద రోగులు ఆయుర్వేద వైద్యాన్ని నమ్ముతారని, ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి ప్రజలకు యోగ పట్ల అవగాహన కల్పించడం ఎంతో అభినందనీయమని అన్నారు. ఆయుర్వేద చికిత్స ద్వారా అనేక దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయమని, గతంలో దేశమంతా వనికించిన కరోనా లాంటి రోగాలను ఆయుర్వేద చికిత్స ద్వారా పూర్తిగా తరిమికొట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుహాసిని సోలోమన్, డిపిఎం కే కళ్యాణ్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రుచిత, ఫార్మసిస్ట్ మారబోయిన చంద్రయ్య, యోగ ఇన్స్ట్రక్టర్లు మంజునాథ్, శ్రీ వాణి, సింగం ప్రవీణ్, కేబి ప్రసాద్, కోమల, వైష్ణవి, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.