calender_icon.png 23 September, 2025 | 5:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెప్మా నూతన భవన ప్రారంభం

23-09-2025 03:10:35 PM

రామకృష్ణాపూర్ (విజయక్రాంతి): పురపాలక పట్టణం రామకృష్ణాపూర్ స్థానిక సూపర్ బజార్ ఏరియాలో రూ.6 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన మెప్మా భవనాన్ని మంగళవారం కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి(Minister Gaddam Vivek Venkataswamy), పాలనాధికారి కుమార్ దీపక్ లతో కలిసి ప్రారంభించారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలో 567 సంఘాలకు గాను 5948 మంది మహిళ సభ్యులు మితిలేని ఋణాలు పొందుతున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందని అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళ సంఘాలకు రూ.21 వేల కోట్ల మితిలేని ఋణాలను అందించడం జరిగిందని పేర్కొన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా,అర్హులకు సన్నపు బియ్యం పంపిణీ,నూతన రేషన్ కార్డుల పంపిణీ చేస్తున్నట్లు మంత్రి మాట్లాడగా సభలో ఉన్న మహిళలు మహాలక్ష్మి పథకం కింద రూ.500 కు గ్యాస్ సిలిండర్ రాయితీ తమకు అందడం లేదని మహిళలు ప్రశ్నిస్తూ నినాదాలు చేశారు.

మా సమస్యలను వినండి సారు

మెప్మా భవన ప్రారంభం అనంతరం బయలుదేరుతున్న మంత్రి వివేక్ వెంకటస్వామిని కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని ఆయన దృష్టికి తీసుకు వెల్దామంటే మంత్రి చుట్టూ నాయకులు, కార్యకర్తలు గుంపుగా ఉంటూ వాళ్ళ లబ్ది కొరకే వాళ్ళు పకులాడుతున్నారని, ప్రజల సమస్యలను మంత్రి దృష్టికి వెళ్లకుండా నాయకులు, కార్యకర్తలు అడ్డుపడుతున్నారని మహిళలు మండిపడ్డారు. తమ సమస్యలను ఇంకెవరికి చెప్పాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ మహిళలు వెనుదిరిగి వెళ్లారు.