calender_icon.png 23 September, 2025 | 6:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటర్ అడ్మిషన్లకు శ్రీ చైతన్య ఎరా..

23-09-2025 04:21:34 PM

పాఠశాల టిచర్ లచే ఇంటింటికి ప్రచారం..

టీచర్ లకు దసరా సెలవులు ఇవ్వని వైనం..

ప్రభుత్వం నిబంధనలకు నీళ్లు.. 

పట్టించుకోని విద్యాశాఖ అధికారులు..

నకిరేకల్ (విజయక్రాంతి): పదవ తరగతి ఇంకా పూర్తి కాలేదు ఇంటర్మీడియట్ అడ్మిషన్ల కోసం శ్రీ చైతన్య, ఇతర కార్పొరేట్ విద్యాసంస్థలు అప్పుడే ప్రచారం నిర్వహిస్తున్నాయి. నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో మంగళవారం శ్రీ చైతన్య విద్యాసంస్థల(Sri Chaitanya Educational Institutions) టీచర్లు ఇంటర్ అడ్మిషన్ల కోసం ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. విద్యా ప్రమాణాలను గాలికి వదిలేసి ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి వారి ఇష్టానుసారంగా లాభేక్షణ దేయంగా మల్టీకలర్ బ్రోచర్లతో తల్లిదండ్రులను మాయాజాలంలోకి నెట్టివేసి ఇంటర్ అడ్మిషన్ల కోసం విద్యార్థులుకు ఎరవేస్తున్నారు. పాఠశాల టీచర్లచే ఇంటింటికి క్యాన్వసింగ్ నిర్వహిస్తున్నారు.

ప్రభుత్వం ప్రకటించిన దసరా సెలవుల్లో కొన్ని ప్రయివేట్ కార్పొరేట్ స్కూల్స్ టీచర్లకు సెలవులు ఇవ్వకుండా, అడ్మిషన్స్ కోసం తిప్పడం, అడ్మిషన్స్ చేయాలని టార్గెట్స్ ఇవ్వడం, ఆన్లైన్ క్లాసులు చెప్పించడం లాంటి పనులు చేస్తూ టీచర్స్ ను ఇబ్బంది పెడ్తూ మేము చెప్పిన పని చేయకుంటే సాలరీ కట్ చేస్తామని బెదిరిస్తున్నారు. ఇలాంటి విద్యాసంస్థలపై విద్యా శాఖ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి. విద్యార్థులకు ఇచ్చిన సెలవు రోజుల్లో టీచర్స్ కు కూడా సెలవులు ఇచ్చి ఎలాంటి పనులు చెప్పొద్దని తెలంగాణ ప్రయివేట్ టీచర్స్ లెక్చరర్స్ ఫెడరేషన్ TPTLF డిమాండ్ చేస్తుంది. ఇంత జరుగుతున్న ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు, తమకేమీ పట్టనట్టు వివరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటాం..

ఎంఈఓ నాగయ్య.. 

ప్రభుత్వ నిబంధన ఉల్లంఘించి ఇప్పటినుండే అడ్మిషన్లు ప్రారంభించిన, ప్రచారం నిర్వహించిన ప్రభుత్వ నిబంధన ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎంఈఓ మేక నాగయ్య తెలిపారు.