23-09-2025 03:31:11 PM
ఎస్సై మోహన్ రెడ్డి..
బిచ్కుంద (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని దాబాలలో మధ్యం సేవించేందుకు, అమ్మేందుకు ఎలాంటీ అనుమతులు లేవని, నిబంధనలు అతిక్రమించి మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవని బిచ్కుంద ఎస్సై మోహన్ రెడ్డి(SI Mohan Reddy) అన్నారు. మంగళవారం బిచ్కుంద పోలీస్ స్టేషన్ లో దాబా హోటల్ యజమానులతో సమావేశం నిర్వహించారు. ఎస్సై మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. దాబా హోటల్లో మద్యం సేవించరాదని, మద్యం అమ్మరాదన్నారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ప్రమాదాలు జరుగుతున్న కారణంగా ధాబా హోటల్ లో మద్యం తాగించడం, అమ్మడం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ధాబా హోటల్ లో మద్యం సేవించి వాహనదారులు ప్రమాదలకు గురై కుటుంబాలు విచ్ఛిన్నం అవుతుందని అన్నారు. ఒక వేళ ధాబా హోటల్ యజమానులు నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం సేవిస్తే చట్టరీత్యా చర్యలు చేపట్టి దాబా సీజ్ చేస్తామన్నారు.