23-09-2025 03:34:05 PM
మందమర్రి (విజయక్రాంతి): మండలంలోని పొన్నారం గ్రామపంచాయతీ పరిధిలోని లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణ లక్ష్మి చెక్కులను గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, రెవెన్యూ అధికారులు పంపిణీ చేశారు. మంగళవారం గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు చెక్కులు అందచేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాసు సంతోష్ కుమార్ మాట్లాడుతూ కల్యాణ లక్ష్మి పథకం పేదింటి ఆడపడుచులకు వరమని ప్రతి ఒక్కరూ లక్ష్మి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాథోడ్ గణపతి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు సొత్కు సుదర్శన్, మండల ఇన్చార్జి కడారీ జీవన్ కుమార్, పైడిమల్ల నర్సింగ్, బొజ్జ రాములు పాల్గొన్నారు.