29-01-2026 02:05:48 PM
భిక్కనూర్,(విజయ క్రాంతి): భిక్కనూర్ మండలం బాగిర్తిపల్లి గ్రామ మాజీ సర్పంచ్ ఎర్రోళ్ల నాగలక్ష్మి భర్త స్వామి అనారోగ్యంతో ఈ నెల 26న మృతి చెందారు. ఈ విషాద ఘటన మండలవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ సందర్భంగా గురువారం బీఆర్‌ఎస్ పార్టీ మాజీ కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్దన్ మృతుని నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. స్వామి మృతి గ్రామానికి తీరని లోటని పేర్కొంటూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొని కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా స్వామి గ్రామానికి చేసిన సేవలను వారు స్మరించుకున్నారు.