calender_icon.png 31 January, 2026 | 3:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాంధీజీ వర్ధంతి..

31-01-2026 12:00:00 AM

ఎర్రుపాలెం జనవరి 30 (విజయక్రాంతి): మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఎర్రుపాలెం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు పాల్గొని గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచానికి అహింస, సత్యాగ్రహ సిద్దాంతాలను అందించిన గాంధీ మార్గం ఎప్పటికి అనుసరణీయం అని పేర్కొన్నారు. 

కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు శీలం శ్రీనివాస్ రెడ్డి, మండల సీనియర్ నాయకులు అనుమోలు వెంకట క్రిష్ణారావు, పంబి సాంబ శివరావు, మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ జానిభాషా, ఎర్రుపాలెం సర్పంచ్ నండ్రు అశ్విని, క్లస్టర్ ఇంచార్జ్ లు కడియం శ్రీనివాసరావు, శీలం వెంకటరామిరెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు దేవరకొండ రాజీవ్ గాంధీ, ఆత్మకమిటి డైరెక్టర్ బాణవత్ శ్రీను, మండల నాయకులు నాగిరెడ్డి శ్రీను, సామినేని రామారావు, బుర్రా నారాయణ, దేవరకొండ ఏడూ కొండలు, గోపాల్ రెడ్డి, దేవరకొండ అనిల్ కుమార్, శ్యామ్, మంద కాంతారావు, షేక్ ఫారూఖ్, బండ్ల ఆత్మ, వేల్పుల క్రాంతి కుమార్, జనార్దన్ రెడ్డి* తదితరులు పాల్గొన్నారు.