calender_icon.png 31 January, 2026 | 1:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హస్తం పేద ప్రజల నేస్తం

31-01-2026 12:00:00 AM

  1. గద్వాల కౌన్సిలర్స్ అభ్యర్థుల నామినేషన్ దాఖలు చేసి భారీ ర్యాలీ...
  2. ఎమ్మెల్యేతో కలిసి పాల్గొన్న జిల్లా డిసిసి అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి

గద్వాల్ జనవరి 30: హస్తం పేద ప్రజల నేస్తం అని ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రె డ్డి, జిల్లా డిసిసి అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి లు అన్నారు. శుక్రవారం గద్వాల మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా రాఘవేంద్ర కాలనీ నుం డి పాత బస్టాండ్ వరకు భారీగా ర్యాలీ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో 37 వార్డు అభ్యర్థుల నామినేషన్ దాఖలు చే సి సందర్భంలో భారీ ర్యాలీ ని నిర్వహించా రు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గద్వాల పట్టణం గతంలో గత పాలకుల పా లనలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు నుండి గ ద్వాల అభివృద్ధి వైపుగా అడుగులు వేస్తుందన్నారు. గద్వాల పట్టణంలోని 37 వార్డు లో సిసి రోడ్డు, డ్రైనేజీ నిర్మాణం, వీధిదీపా లు, ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మంచినీటి సౌ కర్యం కల్పించడం జరిగిందన్నారు. ఎన్నికలలో ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి పేద ప్రజలకు ఆరు గ్యారెంటీలను అమ లు చేయడం జరుగుతుందన్నారు.

గద్వాల కోట పైన కాంగ్రెస్ జెండాను ఎగర వేసి సీఎం కి గద్వాల మున్సిపాలిటీకి కానుకగా ఇద్దామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, సర్పంచులు, మున్సిపాలిటీ కౌన్సిలర్స్ అభ్యర్థులు, నాయకులు కార్యకర్తలు, మహిళలు, యూత్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.