calender_icon.png 6 September, 2025 | 3:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలి

06-09-2025 12:00:00 AM

 ఇబ్రహీంపట్నం ఏసీపీ కేవీపీ రాజు 

యాచారం సెప్టెంబర్ 5 :  గణేష్ నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని ఇబ్రహీంపట్నం ఏసిపి కెవిపి రాజు అన్నారు శుక్రవారం  యాచారం మండల పరిధిలోని మాల్ గ్రామపంచాయతీ ఇందిరమ్మ కాలనీలో భగత్ సింగ్    యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన  గణేష్ పూజ కార్యక్రమం పాల్గొని అనంతరం అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు.  నిర్వాహకులు శాలువాలతో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఏసిపి కెవిపిరాజు  మాట్లా డుతూ మతసామరస్యాన్ని నెలకొల్పే విధంగా మనమందరం కృషి చేయాలన్నారు. గణేష్ నవరాత్రులను భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని చెప్పారు. మండపాల దగ్గర డీజే సౌండ్ పెట్టి ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దని ఆయన  పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో  ఇందిరమ్మ కాలనీవాసులు భగత్ సింగ్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.