17-08-2025 02:21:30 PM
కామారెడ్డి (విజయక్రాంతి): గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని దోమకొండ ఎస్సై స్రవంతి(SI Sravanthi) తెలిపారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన శాంతి సమావేశంలో ఎస్ఐ స్రవంతి పాల్గొని మాట్లాడారు. గణేష్ మండపాలను ఎవరికి ఇబ్బంది కలగకుండా నిర్మించుకోవాలన్నారు. ఉత్సవాలు నిర్వహించే సమయంలో ఎలాంటి గొడవలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల యువజన సంఘాల సభ్యులు, గణేష్ మండపాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.