17-08-2025 03:26:15 PM
జిల్లా ఎస్పీ రాంనాథ్ కేకన్..
మరిపెడ (విజయక్రాంతి): మహబూబాద్ జిల్లా(Mahabubabad District) మరిపెడ మండలంలో గత నాలుగు రోజుల నుంచి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మరిపెడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎడిజర్ల, చెరువు, పురుషోత్తపురం బ్రిడ్జిని జిల్లా ఎస్పీ రాంనాథ్ కేకన్(District SP Ramnath Kekan) సందర్శించారు. అనంతరం ఎస్పీ పోలీసులకు స్థానిక ప్రజలకు పలు సూచనలు చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు వలన వాగులు, చెరువులు, ప్రవహిస్తున్నందున స్థానిక ప్రజల అప్రమత్తంగా ఉండాలన్నారు.
నీటా మునిగిన రోడ్లు వాగులు దాటి ప్రయత్నం చేయవద్దని చేపల వేటకు వెళ్ళొద్దని పశువుల కాపరులు చెరువులు వాగులు దాటవద్దని యువకులు సెల్ఫీల కోసం నీటి ప్రవాహం వద్దకు వెళ్ళవద్దని, అనవసర ప్రయాణాలు చేయొద్దని సూచించారు. అత్యవసర సమయంలో డయల్ హండ్రెడ్ కు స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. వారి వెంట మరిపెడ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్, మరిపెడ ఎస్సై సతీష్ కుమార్ గౌడ్, సిబ్బంది పాల్గొన్నారు.