05-09-2025 11:06:34 AM
వందలాది విగ్రహాలు నిమజ్జనం కోసం ఎదురుచూపులు
తీవ్ర అసంతృప్తితి వ్యక్తం చేస్తున్న గణేష్ భక్తులు
అధికారుల సమన్వయ లోపమే ఈ పరిస్థితి కారణం అంటున్న స్థానికులు
భద్రాచలం,(విజయక్రాంతి): భద్రాచలం పట్టణాన్ని ఆనుకొని ప్రవహిస్తున్న పవిత్ర గోదావరి నదిలో(Godavari River) నిమజ్జనం చేయటానికి రాష్ట్ర నలుమూలల నుండి వందనాలు గణేష్ విగ్రహాలు భద్రాచలం చేరుకుంటున్నప్పటికీ వాటిని నిమజ్జనం(Ganesh immersion) చేయడంలో అధికారులు విఫలమైనారు. ఉభయ ఖమ్మం జిల్లాలోని వివిధ ప్రాంతాలనుండే గాక సరిహద్దు రాష్ట్రం జిల్లాల నుండి కూడా భారీ సంఖ్యలో విగ్రహాలు నిమజ్జనానికి భద్రాచలం చేరుకుంటున్నాయి. శుక్రవారం ఉదయం 9 గంటలకు 700 పైగా విగ్రహాలు భద్రాచలం చేరుకున్నప్పటికీ వాటిని నిమజ్జనం చేసే వివిధ శాఖల అధికారులు, సిబ్బంది మధ్య సమన్వయ లోపం ఉండటంతో సకాలంలో నిమజ్జనం కాకుండా గోదావరి నది ఒడ్డున ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. భద్రాచలంలోనీ పవిత్ర గోదావరి నదిలో నిమజ్జనం చేసి గోదారి స్థానం అనంతరం రామయ్యను దర్శనం చేసుకుని తమకమే స్థానాలకు చేరుకుందామని ఉద్దేశంతో రాష్ట్ర నలుమూలల నుండి అనేకమంది గణేష్ భక్తులు భద్రాచలం నాకు బారీ స్థాయిలో వస్తుంటారు.
గతంలో భద్రాచలంలో నిమజ్జనానికి బారీస్థాయిలో విగ్రహాలు వచ్చినప్పటికీ వాటిని రెండు లాంచీల ద్వారా అప్పటికప్పుడే భక్తుల సమక్షంలోనే నిమజ్జనం చేసే పరిస్థితి ఉండేది. దాంతో సుదూర ప్రాంతాల నుండి గణేష్ విగ్రహాలతో గణేష్ భక్తులు తమ కళ్ళముందే నిమజ్జన కార్యక్రమం పూర్తవడంతో ఎంతో ఆనందంతో రామ దర్శనం అనంతరం తిరిగి గమ్యస్థానాలకు వెళ్లేవారు. అయితే ఈ ఏడాది అటువంటి పరిస్థితి కనిపించడం లేదు. వివిధ వాహనాల ద్వారా వచ్చిన గణేష్ విగ్రహాలను ఉన్న ఒక లాంచి సత్వరమే నిమజ్జనం చేయలేకపోవడంతో వివిధ వాహనాల మీద ఉన్న గ్రహాలను నది ఒడ్డున దించుకుంటున్నారు. దీంతో భక్తులు తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు. గతంలో వరదల
సమయంలో రెవిన్యూ శాఖ తెప్పించిన లాంచీల ద్వారా గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేసేవారు. అయితే నిమజ్జనంలో పాల్గొనే వివిధ శాఖ ఉన్నతాధికారుల సరైన పర్యవేక్షణ లేకపోవడం, క్రింద స్థాయి అధికారుల మాట లాంచీల సిబ్బంది వినకపోవడం, ముందుగా సిద్ధం చేసిన చిన్న పడవలు అవసరాన్ని బట్టి వినియోగించకపోవడం వలన ఈ పరిస్థితి ఏర్పడింది. అదే కాకుండా సింగరేణి సంస్థ పంపించిన భారీ క్రేన్ సైతం డీజిల్ పోయించే పరిస్థితి లేదని ప్రక్కన పెట్టిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా నిమజ్జనంలో పాల్గొనే వివిధ శాఖలు అధికారులు సిబ్బంది సమన్వయంతో పనిచేసి వచ్చిన విగ్రహాలనువెను వెంటనే రెండు లాంచీల ద్వారా నిమజ్జనం చేయాలని పలువురు గణేష్ భక్తులు కోరుతున్నారు. అదేవిధంగా కుదర ప్రాంతాల నుండి భక్తులు భద్రాచలం వస్తున్నందున పవిత్ర గోదావరి స్నానం చేయటానికి ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలని కూడా కోరుతున్నారు.