05-09-2025 11:04:08 AM
గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధం.
నగరంలో గణేష్ నిమజ్జనానికి భారీ బందోబస్తు..
గణనాథుల నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి..
నిమజ్జనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన జీహెచ్‌ఎంసీ.
శనివారం యాభై వేల విగ్రహాలు నిమజ్జనానికి వస్తాయని అంచనా.
హైదరాబాద్: భక్తిశ్రద్ధలతో పూజలందుకున్న గణేశుని(Ganesh Chaturthi)నిమజ్జనానికి వేళ అయింది. నిమజ్జనాల సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు (Hyderabad Traffic Police) ఆంక్షలు విధించారు. రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 10 గంటల వరకు ట్రాఫిక్ అంక్షలు(Traffic Restrictions) అందబాటులో ఉంటాయి. బాలాపూర్ నుంచి చార్మినార్, అబిడ్స్, లిబర్టీ, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, సికింద్రాబాద్ నుంచి ప్యాట్నీ, ప్యారడైజ్, ట్యాంక్ బండ్ మీదుగా మీదగా శోభాయాత్ర కొనసాగుతోంది. టోలీచౌకీ, మెహదీపట్నం నుంచి వచ్చిన విగ్రహాలు ఖైరతాబాద్ మీదుగా నెక్లెస్ రోడ్డుకు, టప్పచబుత్ర, ఆసిఫ్ నగర్ నుంచి వచ్చిన విగ్రహాలు ఎంజే మార్కెట్ వైపు మళ్లించనున్నారు. ప్రధాన మార్గాలపై ఇతర వామనాలకు అనుమతి లేదని ట్రాఫిఫ్ పోలీసులు హెచ్చరించారు. నిమజ్జనం అనంతరం లారీలు నగరంలోకి రాకుండా ఔటర్ రింగ్ రోడ్డు మీదుగానే అనుమతించారు. రేపు ఉదయం 8 నుంచి ఎల్లుండి రాత్రి 11 వరకు నగరంలోకి లారీలకు ప్రవేశం లేదని పోలీసులు తెలిపారు.
ఆర్టీసీ బస్సులు రద్దీ సమయంలో మెహిదీపట్నం, కూకట్ పల్లి, సికింద్రాబాద్, ఉప్పల్, దిల్ సుఖ్ నగర్ వరకే అనుమతించారు. అంతర్రాష్ట్ర, జిల్లా బస్సులు చాదర్ ఘాట్ వైపు మాత్రమే దారి మళ్లించారు. విమానాశ్రయం వెళ్లేవారు పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వే లేదా ఔటర్ రింగ్ రోడ్డు వాడాలని సూచించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వెళ్లేవారు బేగంపేట్- ప్యారడైజ్ మార్గంలో వెళ్లాలని పోలీసులు తెలిపారు. శోభయాత్ర మార్గాల్లో గణపతి విగ్రహాలు లేని వాహనాలకు అనుమతి నిషేధించారు. హుస్సేన్ సాగర్ చుట్టూ రేపు ఉదయం 6 నుంచి ఎల్లుండి 10 గంటలకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. ప్రైవేట్ బస్సులకు రేపు ఉదయం 8 నుంచి ఎల్లుండి 10 వరకు నగరంలోకి అనుమతి నిషేధించారు. అత్యవసర సహాయం కొరకు హెల్ప్ లైన్ నంబర్లు.. 040-27852482, 8712660600, 9010203626.