calender_icon.png 6 September, 2025 | 10:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు గణేష్ నిమజ్జనం

06-09-2025 12:26:19 AM

మెట్‌పల్లి, సెప్టెంబర్ 5  నేడు మెట్ పల్లి పట్టణంలో జరగనున్న గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను సిఐ అనిల్, ఎస్త్స్ర కిరణ్ కుమార్ లతొ కలిసి మున్సిపల్ కమిషనర్ టి మోహన్ శుక్రవారం పరిశీలించారు. నిమజ్జనం జరిగే పట్టణ శివారులోని వట్టి వాగు వద్ద జరుగుతున్న పూడిక తీత పనుల వద్ద మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ వట్టి వాగులో ఇరవై ఫీట్ల లోతు మట్టిని తీయడం జరిగిందన్నారు.

వట్టి వాగు చుట్టూ మరియు గణేష్ నిమజ్జన శోభాయాత్ర జరిగే ప్రదేశాలలో ఇరవై ఐదు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.నిమజ్జనం జరిగే పరిసరాల ప్రాంతం లో ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. గణేష్ నిమజ్జనం శోభాయాత్రను శాంతియుతంగా జరుపు కోవాలన్నారు.

ఈ కార్యక్రమం లో మున్సిపల్ డిఈ నాగేశ్వరరావు, ఏఈ దీపక్, విద్యుత్ శాఖ డిఈ మధుసూదన్, ఎడి జక్కుల అమరేందర్,ముజీబ్, రాజశేఖర్,అనిల్,నిజాం, సృజన్,మనోజ్, కాంట్రాక్టర్ మహేందర్ పాల్గొన్నారు.