calender_icon.png 6 September, 2025 | 1:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మట్టిలో మాణిక్యాలను వెలికి తీసే బాధ్యత ఉపాధ్యాయులపై ఉంది

06-09-2025 12:26:56 AM

ఐటీడీఏ పీవో రాహుల్ 

భద్రాచలం, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి); ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదని, గిరిజన విద్యార్థినీ విద్యార్థులను మట్టిలో మాణిక్యాలను వెలికి తీసే గురుతర బాధ్యత మీపై ఉం దని, మీరిచ్చే సలహాలు, సూచనలు, మీ యొక్క ప్రత్యేక శ్రద్ధ గిరిజన విద్యాలయాల బలోపేతానికి ఉపకరిస్తుందని భద్రాచలం ఐ టీడీఏ పీవో బి.రాహుల్ అన్నారు. శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భం గా గిరిజన భవన్లో నిర్వహించిన గురుపూజోత్సవ వేడుకలో ఆయన ముఖ్యఅతిథిగా పా ల్గొని ప్రసంగించారు.

ముందుగా జ్యోతి ప్ర జ్వలన గావించి, రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సం దర్భంగా ఆయన ఉపాధ్యాయులు విద్యార్థులకు విద్యకు సంబంధించిన అంశాలను కవి త రూపంలో తెలియజేశారు. విద్యార్థుల ఊహలకు ఊపిరిలుదుతూ ఉన్నత స్థానాలను చేరేలా వారిని ఉత్సాహపరిచే ఉపాధ్యా యులందరికీ, విద్యార్థులకు గుణ గుణాలు గుర్తిస్తూ గుణాత్మకమైన విద్య వైపు గురిపెడుతూ గమ్యాన్ని చేరేలా శక్తినిచ్చేది గురువు లన్నారు.

గతంలో ట్రైనింగ్ పిరియడ్ సమయంలో విద్య, వైద్యంపై పరిశీలన చేయడం జరిగిందని, తాను జాయింట్ కలెక్టర్ గా ఉన్న సమయంలో పలుచోట్ల విద్యా ప్రగతికి సంబంధించి ప్రయోగాలు కూడా చేశానని తెలిపారు. ఐటీడీఏ పీవో గా పని చేస్తే, అనేక అంశాలు తెలుసుకునే అవకాశం ఉందని అన్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు, జిపిఎస్ పాఠశాలల్లో గురుకుల కాలేజీలను కలిపి 35వేల మంది పిల్లలు విద్యను అభ్యసిస్తున్నారని, గిరిజన విద్య బలోపేతం కావడానికి మీ అందరి సహకారం తోటే ఏ ప్రోగ్రాం చేసిన అది మీ ద్వారానే పోవాలి అది తప్పని సరిగా పిల్లలకు అందే విధంగా ఉద్దీపకం ప్రవేశపెట్టడం జరిగిందన్నారు.

దాని ద్వారా మంచి ఫలితా లు వచ్చాయని, ప్రాథమిక విద్యలో పునాది గట్టిగా పడితేనే అది హై స్కూల్ లెవెల్లో గాని పై చదువులో కూడా తీసుకెళ్లేది ప్రాథమిక వి ద్య కాబట్టి అది మనం బాగు చేసుకుంటే మనకు మంచి ఫలితాలు వస్తాయన్నారు. క్ర మశిక్షణతో విద్యాబుద్ధులు నేర్పిస్తే మన పిల్లలకు కూడా మంచిగా ఉంటుందన్నారు. ఉన్నత పాఠశాలలో చదివే విద్యార్థులకు వి ద్య అనేది బలోపేతం అవుతుందని అది దృష్టిలో పెట్టుకొని ఇటువంటి కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. తల్లిదం డ్రు లు తమ పిల్లలను ఎంతో నమ్మకము తో బడులకు పంపిస్తా రని, అక్కడున్న ఉపాధ్యాయులు, సిబ్బంది వారిని తమ సొంత పిల్లలా, కంటికి రెప్పలా కాపాడుతూ చూసుకోవాలన్నారు. 

  సమాజంలో మనం అంద రితో అనగా ఇంజనీర్స్, డాక్టర్స్ అవసరం పడ్డప్పుడే మనము వారితో కనెక్ట్ అవుతారని, పుట్టిన ప్రతి ఒక్క బాబు గాని పాప గాని మెజార్టీ భాగము వాళ్ళ యవ్వనం వాళ్ళ పరిస్థితి ఏదైనా ఉందంటే అది విద్యాశాఖ మాత్రమే అని, పిల్లలు ఏమీ తెలియని పసిపిల్లలను తల్లిదండ్రులు ఎక్కడి నుంచో తీసు కువచ్చి మన పాఠశాలల్లో చేర్పిస్తా రని వారి కి విద్యాబుద్ధులు నేర్పించి ఎవరెస్టు శిఖరం ఎక్కించే స్థాయికి వాళ్ళకు జ్ఞానాన్ని అందిం చి వాళ్లు ఉన్నతమైన స్థానాలకు తీసుకెళ్లడానికి కృషి చేస్తున్న ఉపాధ్యాయు లందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ని 116 ఇన్స్టిట్యూషన్లకు మెడికల్ కిట్లు అందించారు.

ఆశ్రమ పాఠశాలలు, పదవ తరగతి నూటికి నూరు శాతం పరీక్షా ఫలితాలు సాధించిన ఆయా పాఠశాలల హెడ్మా స్టర్ లను, ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. ఉత్తమ టీచర్లుగా ఎంపికైన వారికి పురస్కారాలు అందజేశారు. అదేవిధంగా టీచర్స్ డే సందర్భంగా ఉద్దీపకం టు రూపకల్పనలో సహాయ సహకారాలు వార్టీన్లకు ప్రత్యేకంగా పురస్కారాలను అందజేశారు. బిఈడి కళాశాల మరియు డి ఈ డి కళాశాలలో 100% ర్యాంకులు సాధించినందుకు లెక్చరర్లకు మెమొంటో శాలువాలతో సత్కరించారు.  

అనంతరం ప్రాజెక్ట్ అధికారి డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని ఏసీఎంవోలు ఏటిడిఓ లకు ఉపాధ్యాయులు ఘనంగా సన్మా నించారు.ఈ కార్యక్రమంలో డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ, ఏసీఎంవో ర మేష్, రాములు, ఏటీడీవోలు అశోక్ కుమా ర్, చంద్రమోహన్, జి సి డి వో అలివేలు మంగతాయారు, డిడి ట్రైబల్ వెల్ఫేర్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.