calender_icon.png 6 September, 2025 | 7:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లంబాడాలను ఎస్టీ జాబితాలో నుంచి తొలగించాలి

06-09-2025 12:25:04 AM

 చర్ల మండల ఆదివాసి జేఏసీ

చర్ల, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): మండలంలో 9 ఆదిమ జాతులైన తెగలు చర్ల మండల ఆదివాసి జేఏసీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కి , అదిలాబాద్ మాజీ ఎంపి సోయం బాపురావుకి మద్దతుగా చర్ల మండలంలో ర్యాలీ నిర్వహించి, లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని నినాదాలు చేస్తూ బస్టాండ్ సెంటర్లో దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఆదివాసీల జోలికొస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

అక్రమంగా ఎస్టి జాబితాలో లంబాడిలను వాళ్లు నోటిఫైడ్ కాకముందే ఎస్టీ జాబితాలో ఎలా చేర్చారని జేఏసీగా ప్రశ్నించారు, రాష్ట , కేంద్ర ప్రభుత్వాలు బాధ్యతగా తీసుకొని లంబాడిలను తక్షణమే తొలగించాలన్నారు. ఎక్కడి నుంచో లంబాడీలు వలస వచ్చి తప్పుడు కులం సర్టిఫికెట్లు పొందుతున్నారని ఆరోపించారు.

లంబాడాలు వేరు,వేరు ప్రాంతాల్లో మహారాష్ట్రలో ఓసి, కర్ణాటకలో ఎస్సీ చత్తీస్గడ్ లో ఎస్సీ కర్ణాటకలో ఎస్సీ అని కులంలో పుట్టి మానవజాతిగా చట్టపరంగాను కులం,మతం, సంస్కృతులు, సాంప్రదాయాలు,అభిరుచులు మారవని ఇది సుప్రీంకోర్టు గైడ్ లైన్ ప్రకారం భారతదేశంలో దొడ్డి దారిన దొంగతనంగా తప్పుడు సర్టిఫికెట్లు ఇస్తున్న అధికారులను గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వలస వచ్చినంత మాత్రాన కులం,మతం,జాతి మారదని ఇకనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి లంబడాలు ఏ రాష్ట్ర నుంచి వలస వచ్చారో ఆ ప్రాంతంలోని ఆ ఇంటి పేరుతో గాని ఆ జాతి పేరుతో గాని రాష్ట్రాల్లో ఏవైతే ఆధారాలు ఉన్నాయో వారి స్థితిగతులు పరిశీలించి అదే కుల ధ్రువికరణపత్రం ఇవ్వాలని చర్ల మండల ఆదివాసి జేఏసీ గా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి జేఏసీ నాయకులు,ఆదివాసుల పెద్ద ఎత్తున పాల్గొన్నారు.