calender_icon.png 26 August, 2025 | 8:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గణేష్ మండళ్ల నిర్వాహకులు నిబంధనలు పాటించాలి

26-08-2025 06:41:38 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలో ఏర్పాటు చేసిన గణేష్ మండళ్ళ వద్ద నిర్వాహకులు నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ కోరారు. మంగళవారం బెల్లంపల్లి మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ హాలులో ఏర్పాటు చేసిన మండపాల ఇన్చార్జిలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. వినాయక చవితి పండుగ నుండి నిమజ్జనం వేడుకలు పూర్తయ్యే వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎక్కడైనా సమస్య తలెత్తితే పోలీసులు దృష్టికి తీసుకురావాలని కోరారు.