30 July, 2026 | 12:09 AM

భారీ ఏర్పాట్ల మధ్య వినాయక నిమజ్జన కార్యక్రమం

03-09-2025 01:16 AM

మనోహరాబాద్,(విజయక్రాంతి): మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రంలోని శివాలయం యూత్ అసోసియేషన్ వారు భారీ ఏర్పాట్ల మధ్య నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ నాయకులు మాజీ సర్పంచ్ చిటుకుల మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిమజ్జన వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, నక్క ప్రభాకర్, కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

ఏర్పాటుచేసిన ఉత్సవ కమిటీ స్టేజిపై కళాకారులు అద్భుతమైన తెలంగాణ భక్తీ పాటల ద్వారా జనాలను ఉత్తేజపరిచారు. మిరుమిట్లు కొలిపే విద్యుత్తు కాంతుల మధ్య ఆ గణనాయకుని నిమజ్జనం కొనసాగింది. ఇందులో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, ఫ్యాక్స్ చైర్మన్ బాలకృష్ణ రెడ్డి, వెంకట్ రెడ్డి, తూప్రాన్ కాంగ్రెస్ నాయకులు, సిహెచ్ వెంకట్ రెడ్డి, జావేద్ పాషా, మహేందర్, మనోహరాబాద్ కాంగ్రెస్ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.