03-09-2025 01:18:57 AM
హనుమకొండ సెప్టెంబర్ 2 (విజయ క్రాంతి): వరంగల్ జిల్లాలో భారీగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అడవుల్లో గుట్టుగా గంజాయిని దాచి పోలీసులు కంటపడకుండా గుట్టుగా స్మగ్గింగ్ చేస్తున్న ముఠాను అరెస్టు చేసి దాదాపు నాలుగు కోట్ల విలువైన గంజాయిని వరంగల్ పోలీసులు పట్టుకున్నారు. మంగళ వారం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ హనుమకొండలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వివరాలు వెల్లడించారు.
వరంగల్ జిల్లా ఖానాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని పాకాల అటవీ ప్రాంతంలో చిలుకమ్మ నగర్ గ్రామం దాటిన తర్వాత చిలుకలగుట్ట ఏరియా పైన అనుమానాస్పదంగా కొందరు బస్తా సంచులు పుట్టపై నుంచి తీసుకు వస్తున్నట్లు పోలీసులకు సోమవారం సాయం త్రం సమాచారం అందింది. దీంతో వరంగల్ డ్రగ్ కంట్రోల్ బృందం, ఖానాపురం పోలీసుల ఆధ్వర్యంలోని పోలీసుల బృందం చిలుకలగుట్ట ఏరియాకు వెంటనే వెళ్లి తనిఖీలు చేపట్టారు. అక్కడ నలుగురు వ్యక్తులు నాలుగు బస్తా సంచులను ఒక పల్సర్ వాహనంపై రవాణా చేసేందుకు ప్రయత్నిస్తున్నా రు.
వెంటనే నర్సంపేట రూరల్ సీఐ సాయి రమణ, ఖానాపురం ఎస్‌ఐ రఘుపతి ఆధ్వర్యంలో అక్కడ ఉన్న నలుగురు అపరిచిత వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి దగ్గర ఉన్న బస్తా సంచులను పరిశీలించగా ఆ సంచుల్లో గంజాయి ఉంది. ఆ నలుగురిని విచారణ చేయగా అడవిలోని చిలుకల గుట్ట పైన మరికొన్ని గంజాయి బస్తాలను దాచి ఉంచినట్లు ఇవన్నీ ఒరిస్సా-ఆంధ్రా బార్డర్ నుంచి తీసుకు వచ్చినట్లు తెలిపారు. ఖానాపురం పోలీసులు,
డ్రగ్ కంట్రోల్ టీం ఆధ్వర్యంలో పోలీసులు చిలకలగుట్ట పైకి వెళ్లి వెతకగా అక్కడ దాచి ఉంచిన మరో 19 బస్తాల ఎండు గంజాయి స్వాధీన పరుచుకున్నారు.కాగా పోలీసులకు పట్టుబడ్డ నలుగు రు నిందితులలో ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి మం డలం గుంపిన గండి గ్రామానికి చెందిన అందాల పాండు రెడ్డి, ఒరిస్సా రాష్ర్టం మల్కనగిరి జిల్లా కలిమెల ప్రాంతానికి చెందిన గుల్లారి మునిరాజ్ , ఒరిస్సా రాష్ర్టంలోని మల్కనగిరి జిల్లా చిత్రకొండ ప్రాంతానికి చెందిన కొప్పు కోటయ్య లతో, సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం పోలవరం తం డాకు చెందిన భూక్య సాయికుమార్ ఉన్నా రు.
ఈ ముఠాలో వీరితో పాటు మరో నలుగురు పరారీ లో ఉన్నారని, వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని సీపీ తెలిపారు. పెద్ద ఎత్తున ఈ గంజాయిని ఒరిస్సా నుంచి కర్ణాటక రాష్ట్రానికి సరఫరా చేస్తున్నారన్నారు. పట్టుకున్న గంజాయి 763 కిలోలు ఉందని, దీని విలువ రూ. 3,81,92,000 రూపాయల విలువ ఉం టుందని సిపి తెలిపారు.
ఇంత పెద్ద ఎత్తున విలువైన నిషేధిత గంజాయిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఈస్ట్ జోన్ డిసిపి అంకిత్, నర్సంపేట ఏసిపి రవీందర్ రెడ్డి, ఖానాపురం, ఎస్సు రఘుపతి, వరం గల్ స్పె షల్ బ్రాం ఏసిపి జితేందర్ రెడ్డి, డ్రగ్ కంట్రో ల్ టీం, ఏఆర్ సీఐలను, ఆర్ ఐ, ఎస్‌ఐలను, ఏఆర్ కానిస్టేబుల్‌లను అభినందిం చి నగదు రివార్డులను అందించారు. నిందితులను రిమాండ్‌కు తరలిస్తు న్నట్లు, మిగి లిన నలుగురు నిందితులను త్వరలోనే పట్టుకొని అరెస్టు చేస్తామని ఆయన తెలిపారు.