calender_icon.png 4 September, 2025 | 8:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్యాట్ ఉత్తర్వులతో.. ఐఏఎస్ శివశంకర్ రిలీవ్

03-09-2025 01:16:23 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): ఐఏఎస్ అధికారి తోలేటి శివశంకర్‌ను తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేసింది. హైకోర్టు ఆదేశాలు అమల్లో ఉన్న నేపథ్యంలో క్యాట్ ఉత్తర్వుల మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ (డీవోపీటీ)శివశంకర్‌ను తెలంగాణ కేడర్ నుంచి రిలీవ్ చేసి ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు పంపేందుకు అంగీకరించింది. ఈ మేరకు శివశంకర్‌ను రిలీవ్ చేస్తూ సీఎస్ రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు.

2013 క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి లోతేటి శివశంకర్ స్వస్థలం ఏపీలోని విజయనగరం జిల్లా ధర్మవరం. అయితే, ఆయన హైదరాబాద్‌లో ఉన్న తన మామయ్య ఇంట్లో ఉండి సివిల్ సర్వీసెస్‌కు ప్రిపేర్ అయ్యారు. అదేవిధంగా యూపీఎస్సీ దరఖాస్తు ఫారంలో పర్మనెంట్ అడ్రస్‌గా అదే ఇచ్చారు. రాష్ర్ట విభజన సమయంలో కేడర్ నిర్ణయించేటప్పుడు చిరునామా ఆధారంగా శివశంకర్‌ను తెలంగాణకు కేటాయించారు.

అయితే, ఆ నిర్ణయాన్ని ఆయన సవాలు చేస్తూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా ధర్మాసనం స్టే ఇచ్చింది. ఆయన ఏపీ క్యాడర్‌లో గత 11 ఏళ్లు పని చేశారని దీపక్ ఖండేకర్ ఆధ్వర్యంలోని ఏకసభ్య కమిషన్ సిఫారసు మేరకు శివశంకర్‌ను తెలంగాణకు పంపారు. ఇదే విషయంపై శివశంకర్ క్యాట్‌ను ఆశ్రయించగా.. గతేడాది ఫిబ్రవరి 28న ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. క్యాట్ ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ డీవోపీటీ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేయగా.. హైకోర్టు కూడా క్యాట్ ఉత్తర్వులనే సమర్థిస్తూ జులై 3న తుది తీర్పును వెలువరించింది.